Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాశ్మీర్ లోయలో వేర్పాటువాద నాయకులు, సంస్థలకు ఆయన మద్దతు తెలుపుతున్నారనే ఆరోపణలతో 'చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (ఊపా) కింద ఆ సంస్థపై నిషేధం విధించింది. ఈ మేరకు యాసిన్ మాలిక్నూ అరెస్ట్ చేసిన అధికారులు.. ఆయనను జమ్మూలోని కోట్బల్వాల్ జైలుకు తరలించారు. ఈ నెలలో జమాతేఇస్లాం తర్వాత జేకేఎల్ఎఫ్పైనా నిషేధం విధించడం గమనార్హం.