Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో ఓ కుటుంబం సామాజిక బహిష్కరణ
ముంబయి : మహిళకు వర్జినిటీ(కన్యత్వ) పరీక్ష వద్దని అడ్డుచెప్పిన ఓ కుటుంబం సామాజిక బహిష్కరణకు గురైంది. మహారాష్ట్రలోని కంజర్భట్ సామాజికవర్గం.. పెండ్లికి ముందు మహిళ వర్జిన్(కన్య) అని నిరూపించుకోవాలనే వివాదాస్పద ఆచారాన్ని పాటిస్తున్నది. ఈ ఆచారాన్ని నేరంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రకటించింది గానీ, అమలు చేయడం వైపు అడుగులు వేయలేదు. మహారాష్ట్రలోని థానె జిల్లాలో అంబర్నాథ్ టౌన్‌కు చెందిన ఒక కుటుంబం ఈ దురాచారాన్ని ఏండ్లుగా ప్రశ్నిస్తూ వస్తున్నది. కాగా, ఆ కుటుంబంపై కక్ష కట్టిన కంజర్భట్ కుల పెద్దలు వారిని సామాజికంగా వెలివేశారు. ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోరాదని హుకుం జారీ చేశారు. ఇటీవల తన నానమ్మ చనిపోయినా.. అంతిమ సంస్కారాలకు కులస్థులెవరూ రాలేదని వివేక్ తమారు చికార్ తెలిపారు. అంతేకాకుండా.. ఓ పెండ్లికి సంబంధించిన కార్యక్రమంలో పెద్దఎత్తున చప్పుళ్లు చేస్తూ ఇబ్బంది పెట్టారని వివరిం చారు. ప్రగతిశీల సమాజంలో ఇలాంటి బహిష్కరణలకు తావుండకూడ దని చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.