Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు..
- చంద్రయాన్-2పై ఇస్రోకు అంతర్గత నివేదిక
న్యూఢిల్లీ: చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి, మరికొద్ది నిమిషాల్లో దిగాల్సిన చంద్రయాన్-2 అనూహ్యంగా హార్డ్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రయోగం చివరి నిమిషంలో దెబ్బతినడానికి కారణాలు కనుగొనే ప్రయత్నం ఇస్రో చేస్తోంది. దీనికి సంబంధించి అంతర్గత నివేదికను స్పేస్ కమిషన్‌కు అందజేసినట్టు సమాచారం. ల్యాండింగ్ కోసం వినియోగించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగానే ఈ ఎదురుదెబ్బ తగిలిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. వాస్తవానికి చంద్రయాన్-2 30 కిమీల ఎత్తు నుంచి 5 కీమీల వరకూ సాఫీగానే చంద్రుడి వైపు ప్రయాణించింది. ఎంతో రిస్క్‌తో కూడిన ఈ దశలోనూ ఎటువంటి లోపం తలెత్తలేదు.