Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేనొక బయాలజీ రీసెర్చ్ స్కాలర్ని.. అడవుల్లో కనిపించే వివిధ రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, చెట్లు, పూలు వంటి వాటి గురించి శోధించడంతో పాటు ఫొటోలు కూడా తీస్తుంటాను.. అందులో భాగంగా నా కెమేరాలో బంధించినవే ఈ సీతాకోక చిలుకలు.. ప్రకృతిలో కనువిందు చేసే వాటిలో సీతాకోక చిలుకలు ఒకటి... ఇవి ఎక్కువగా పగటిపూట ఎగురుతూ... వీటి రెక్కలపైన ఉండే రకరకాల రంగులతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.. ఇవి ఎగిరే విధానం పరిశీలించడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైనదే... ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం నాలుగు దశలు - గ్రుడ్డు, లార్వా లేదా గొంగళి పురుగు, విశ్చేతనంగా ఉండే ప్యూపా, తరువాత రూపవిక్రియ చెందిన రంగురంగుల
రెక్కల ''సీతాకొక చిలుక''. రంగురంగులతో మైమరపించే సీతాకోక
చిలుకలను కెమెరాతో బంధించడం నాకు కొత్త అనుభూతి!!
- భరత్ సింహ
9676563278