Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ మకుటం రామప్ప దేవాలయం. కాకతీయుల శిల్పకళకు నిదర్శనం ఈ ఆలయం. తెలంగాణ ప్రాంతంలో అనేక చెరువులు నిర్మించి వ్యవసాయాన్ని అభివద్ధి పరచిన కాకతీయులు శిల్పకళకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. వీటిలో స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన వేయి స్థంభాల గుడి, గణపతి దేవుని కాలంలో నిర్మించిన ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయం ప్రముఖంగా చెప్పుకోదగినవి. రామప్ప శైవ సాంప్రదాయానికి చెందిన ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ సామాన్య శకం 1213 నాటి శాసనం ప్రకారం ఆలయాన్ని కాకతీయ గణపతి దేవుని సేనాపతి రేచర్ల రుద్రుడు నిర్మిస్తే, రామప్ప అనే శిల్పి రూపొందించాడు. అతని పేరుతోనే ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. కాకతీయుల పరిపాలనా కాలంలో తెలుగు నేలను సందర్శించిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో రామప్ప దేవాలయాన్ని ''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం'' అని వర్ణించాడు. ఈ దేవాలయంలో చెక్కిన పేరిణీ శివతాండవం నత్య శిల్పాలు చూసి నటరాజ రామకష్ణ కాలగర్భంలో కలిసిపోయిన ఆ నత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఈ అద్భుతమైన దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కటం, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి గర్వకారణం. ప్రజారంజక పరిపాలన అందించిన కాకతీయ ప్రభువులకు ఈ గుర్తింపు ఒక గొప్ప సత్కారం. ఈ దేవాలయంలోని గర్భాలయం తేలికైన ఇటుకలతో నిర్మితమ వ్వటం వల్లన అవి నీటి మీద కూడా తేలియాడుతాయి. అవి సామాన్య ఇటుకలతో పోలిస్తే కేవలం వాటిలో ఇరవై అయిదు శాతం మాత్రమే బరువు ఉంటాయి అని పరిశోధకుల అంచనా. దేవాలయాన్ని ప్రధానంగా ఎర్రని ఇసుక రాయితో నిర్మించారు. శిల్పాలు నల్లరాయితో నిర్మించారు. చివరి కాకతీయ రాజైన ప్రతాప రుద్రునికి ఢిల్లీ చక్రవర్తి ప్రతినిధి అయిన ఉలుఫ్ు ఖాన్ (ముహమ్మద్ బిన్ తుగ్లక్) మధ్య జరిగిన ఆరు నెలల భీకర యుధ్ధంలో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఈ ఓరుగల్లు ముట్టడిలో భాగంగా తురుష్కులు పరిసర ప్రాంతాల్లోని అనేక దేవాలయాలు ధ్వంసం చేశారు. ఈ సమయంలోనే ఢిల్లీ సైన్యాలు రామప్ప దేవాలయం మీద దాడి చేసి గుడిలో ఉన్న సంపదను కొల్లగొట్టి దేవాలయాన్ని పాడు చేశాయి. ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చారు. ఢిల్లీ పాలనలోకి వెళ్ళిపోయిన తెలంగాణ ప్రాంతం సాంస్కతిక విధ్వంసానికి గురయింది. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణాకు స్వాతంత్రం తీసుకురావటానికి ముసునూరి కాపయ నాయకుడు అనే మహావీరుడు ముందుకు వచ్చి పది సంవత్సరాలకు పైగా నిరంతర యుద్ధాలు చేసి చివరికి సామాన్య శకం 1336 ప్రాంతంలో ఓరుగల్లు కోటను జయించి తెలంగాణ ప్రాంతం నుండి ఢిల్లీ సుల్తానులను తరిమి వేశాడు. ఓరుగల్లు మహాచక్రవర్తిగా తెలంగాణ ప్రాంతాన్ని ముప్పరు సంవత్సరాలకు పైగా కాపయ పరిపాలించాడు. తురుష్కులు నాశనం చేసిన రామప్ప దేవాలయన్ని అభివద్ధి చేయటానికి విశ్వప్రయత్నం చేశాడు కాపయ. రామప్ప దేవాలయం పూర్తిగా కూలిపోకుండా ఈనాటికీ నిలబడి ఉంది అంటే ఆనాడు కాపయ నాయకుని కషి కూడా ఒక కారణం. కాపయ నాయకుని కుటుంబానికి చెందిన ప్రస్థుత వారసుడైన మాక్రోమీడియా డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ముసునూరి రామకష్ణ ప్రసాద్ తన పూర్వీకుల చరిత్రను భావితరాలకు అందించటానికి విశిష్ట కషి చేస్తున్నారు. కాపయ నాయకుని తరువాత రామప్ప దేవాలయం బహమనీ, కుతుబ్ షాహీ, నిజాం పాలకుల ఏలుబడిలోకి వెళ్ళటం వల్ల ఏ మాత్రం అభివద్ధికి నోచుకో లేదు. కాకతీయ యుగంలో వైభవోపేతంగా వెలిగిపోయిన రామప్ప దేవాలయం ఆ స్థాయిని మళ్ళీ ఏ నాడూ అందుకోలేక పోయింది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ దేవాలయన్ని ప్రభుత్వాలు మరింతగా అభివద్ధి చెయ్యాల్సిన బాధ్యత ఉంది.
- యడ్లపల్లి అమరనాథ్, 9398245804