Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రకతిలో ఉండే ఎన్నో రకాల పక్షులు గూడు కట్టే విధానం ఒక్కో పక్షిది ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అటువంటి క్రేజీ బర్డ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 'టైలర్ బర్డ్'. ఈ టైలర్ బర్డ్ గూడు కట్టుకోవటం చూస్తే వావ్.. అని కచ్చితంగా అనిపిస్తుంది. ఏదో పెద్ద పెద్ద టైలర్లు బట్టలు కుట్టినట్టుగా గూడు కట్టుకుంటుందీ పక్షి. చెట్ల కొమ్మలకు ఉండే ఆకుల్ని కలిపి కుట్టేస్తుంది. ఏంటీ ఆకుల్ని కుట్టటానికి దానికి సూదీ దారం ఎవరిచ్చారు? ఎక్కడనుంచి తెచ్చుకుంది? అంటారా... అదే మరి ప్రకతి వింత అంటే టైలర్ పక్షి ముక్కునే సూదిగా.. దూదినే దారంగా చేసుకుని ఆకుల్ని కలిపి కుట్టేసి గూడుగా తయారు చేసుకుంటోందీ బుల్లిపిట్ట. పిచ్చుక సైజులో ఉండే ఈ బుల్లిపిట్ట ఆకులనే ఇల్లులా కట్టుకుంటుది. దీని కోసం అది తన ముక్కును సూదిలా చేస్తుంది. ఆకుల చివర్లకు కన్నాలు పెట్టి ఆ కన్నాలలోంచీ దూదిని దారంలా సన్నగా చేసి లాగుతుంది అలా మూడు, నాలుగు రోజుల్లో గూడు కట్టుకుంటుంది. గూడు రెడీ అయ్యాక అందులో దూది, మెత్తగా ఉండే పీచులాంటివి సేకరించి మెత్తటి పరుపులా తయారు చేస్తుంది గూడు లోపల. ఆ తరువా దానిపై గుడ్లు పెడుతుంది.
అసలు ఈ బర్డ్ ఇలా గూడు ఎలా కట్టుకుంటుంది? దూదిని దారంగా చెయ్యవచ్చు అని దీనికి ఎవరు చెప్పారు.. దీనికి అన్ని తెలివితేటలు ఎవరిచ్చారు? అంటే కచ్చితంగా ప్రకతే అని చెప్పాలి. ఆ ప్రకతే జీవించటం ఎలాగో నేర్పిస్తుంది. సంతానాన్ని ఎలా అభివద్ధి చేసుకోవాలో నేర్పిస్తుంది. ఆయా ప్రదేశాల వాతావరణాన్ని బట్టి ఆయా ప్రాణులు వాటి సంతాన్ని అభివద్ధి ఎలా చేసుకోవాలో నేర్పిస్తుంది. దాంట్లో భాగమే ఈ టైలర్ బర్డ్ గూడు కట్టుకునే పద్ధతి. ఇటువంటి ఎన్నో జ్ఞానాలకు, విజ్ఞానాలకు నెలవు ఈ అత్యద్భుతమైన ప్రకతి. మరి టైలర్ బర్డ్ తెలివితేటల్ని మీరు కూడా కచ్చితంగా వావ్ అనాల్సిందే..