Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణాఫ్రికా జెండాను చూసే ఉంటారు కదూ..! రంగు రంగుల్లో అనేక జాతుల సంగమాన్ని సూచిస్తుంది. వానవిల్లు దేశంగా పేరు రావడానికి ఓ కారణం కూడా అక్కడి విభిన్న సంస్కతుల కలబోతే. వీటికి ప్రతీకాత్మకంగా ఓ ఊరు ఉందక్కడ. కేప్‌టౌన్‌లోని భాగమైన బొ-కాప్ రంగులతో నిండిపోయి ఉంటుంది. భవనాలన్నీ కూడా తీక్షణమైన వర్ణాలతో స్వాగతం పలుకుతాయి. మలరు క్వార్టర్ అనే కూడలి వద్ద వానవిల్లులోని రంగులన్ని వీధి గోడలపై కనిపిస్తాయి. 16-17 శతాబ్దాల్లో డచ్‌వాళ్లు 'కేప్ మలర్సు'గా పిలుచుకున్న భారత్, మలేసియా, ఇండోనేషియా, శ్రీలంకతోబాటు మడగాస్కర్ మిగతా ఆఫ్రికా దేశాల బానిసల్ని ఇక్కడికే తరలించారు. వారి సంతతి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతానికి అలా పేరు వచ్చింది. తెల్లవాళ్లు ఎక్కువగా ఉండే కేప్‌టౌన్‌లో ఒకప్పుడు ఇండ్లన్నింటికీ తెల్ల రంగే వేసేవారట. దీనికి భిన్నంగా బో-కాపు వైవిధ్య రంగుల్లో నింపేసి ఈద్ శుభాకాంక్షలు తెలుపుకునేవారట. స్థానికులు. ఇరుగు-పొరుగు వారు ముందే మాట్లాడుకుని రంగుల్ని ఎంపిక చేసుకుని వేసుకోవడం వీరి ఐక్యతకు నిదర్శనం.