Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకతి... జీవులకు వాటి శరీరం తీరు, రంగు, బలం, ఇలా కొన్ని ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది. వాటిల్లో కొన్ని మరీ ప్రత్యేకం అనిపిస్తాయి. అలా ప్రకతి రక్షణ పక్షిల్లో ఒకటి 'పోటు..' ఇది దక్షిణ అమెరికాలో ఓ పక్షి. చూడటానికి పక్షిలాగా ఉండదు. దానిని చూస్తే ఏదో ఎండిపోయిన కర్ర అనుకుంటారు. నరికేసిన చెట్టు కాండం ఎండిపోతే ఎలా ఉంటుందో ఆ పక్షి అలాగే ఉంటుంది. దాని శరీరం, ఈకలు, తల అన్నీ ఎండు కర్రలాగే ఉంటాయి. కలర్ కూడా అలాగే ఉంటుంది. దానికి తోడు ఆ పక్షి ఎప్పుడు వాలినా ఎండిన కర్రలపైనే వాలుతుంది. అలా తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఇలాంటి పక్షులు, జీవులను మభ్యపెట్టే జీవులు అంటారు. ఎవరైనా మామూలుగా చూస్తే ఈ పక్షి కనిపించదు. ఒకటికి రెండుసార్లు పరిశీలనగా చూస్తేనే అక్కడ ఓ పక్షి ఉన్నట్టు తెలుస్తుంది. కొలంబియాలోని అల్ట్రా నేషనల్ నేచురల్ పార్కులో ఇవి కనిపిస్తాయి. విశేషమేంటంటే.. పగటిపూట ఈ పక్షులు అస్సలు కదలవు. ఆడపక్షి పెట్టిన గుడ్డును పొదుగుతూ రెండు జంట పక్షులూ ఒకేచోట కదలకుండా ఉంటాయి. అందువల్ల ఇవి అక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. రాత్రివేళ వేటాడుతూ తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. పగటివేళ మాత్రం ఇవి కళ్లు పూర్తిగా తెరవకుండా జాగ్రత్తపడతాయి. అలా ఈ పక్షులు అన్ని రకాలుగా తమను ఎవరూ గుర్తుపట్టకుండా
జాగ్రత్త పడతాయి.