Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : ఆగదు ఏ పన్ను నీ కోసమూ
ఆగితే సాగదు ఈ ప్రభుత్వము
ముందుకు సాగదు ఈ ప్రభుత్వమూ !
చరణం-1: జీతమ్ తక్కువని, ధరలు పెరుగునని
తెలిశినా కొత్త పన్ను రాక ఆగదు !
కారు చవక అని
డీజిల్ దొరుకునని తెలిశినా,
అర్ధరాత్రి ప్రకటన ఆగదు
ఆగదు ఏ పన్ను నీ కోసము !
చరణం-2 : జీఎస్టీ ఒక వ్యూహమని,
లోపలికి వెడితే రామని
తెలిసినా పన్ను పొటూ ఆగదు !
సంపద స్వర్గమని
టాక్సూ నరకమని తెలిసినా
స్వర్గ నరక చక్రమాగదూ !
పన్ను తధ్యమని
ఏ జీవికి తప్పదని తెలిసినా
ఈ సంపాదన ఆగదు !
..... .......
ఈ ''పై'' సంపాదన ఆగదు !
చరణం-3 : సెంటర్, స్టేట్
కలయికతో ఉదయించక ఆగదు పన్ను !
పన్నుల పోటుతో విరగక మానదు వెన్ను!
పన్ను పెరిగినా, డబ్బు పొయినా ఆగదు
ఈ పన్నుల ప్రవాహాం !
పన్ను కట్టినా, కట్టని పన్నయినా
ఆగదు టాక్సాభీ షేకమ్ !
ఆగదూ టాక్సాభిషేకమ్ !
- వీరేశ్వరరావు మూల
veeru16@gmail.com