Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండల
చెట్టునీడన
నాలుగు మధ్యం సీసాలు
విందుకు పోగైనై
జంబో గ్లాసుల్లో
ఆనందాన్ని ఒంపుకొని
చీర్సు కొట్టినై
ముక్కను కొరికి
మెత్తగ నమిలి
బొక్కను గిరాటేసినై
మత్తెక్కువైన బాటిళ్లు
గళ్ళాలు పట్టుకొని
బట్టలిప్పుకున్నై
గుండె పగిలిన బాటిల్
పెంకులు పెంకులుగా రాల్చుకొని
గాయపడ్డది
గొడుగు పట్టి నిలబడ్డ చెట్టుకింద
కాసేపు తత్వపుగాలి
మాటై, పాటై, నవ్వై, ఏడుపై
అటూఇటూ వీచింది
వానాకాలం
చెట్టునీడ
'గాజు పల్లేరు' మొలకలతో
రక్తమోడింది.
- వడ్లకొండ దయాకర్
9440427968