Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెట్ల కొమ్మలకు పండైనా
పండుటా కైనా రాలిపోయే వరకు
అంటుకునే ఉంటుంది
మోయలేని బరువని
కొమ్మలు వదిలించుకుంటాయా !
పిల్లలు వద్ధాశ్రమంలో
తల్లిదండ్రులను వేసి
చేతులు దులుపుకుంటున్న
చందముగా ఉంటాయా !
మల్లె తీగలకు
పరిమళించే పూలు భారమా !
పెంచి పోసిన కన్న పేగులను
పిల్లలకు మోయాలేరా !
కలువ వద్దకు చెంద్రుడే దిగి వచ్చి
అనురాగం చిలికితే
కమలము చెంతకు
సూర్యుడే వచ్చి ఆప్యాయత
పంచితే ప్రకతి పరవశించిపోదా !
పెన వేసుకునే రక్త బంధాలను మరచి
అనుబంధాలను నిర్దాక్షిణ్యంగా తెగ నరికి
కృంగి కృశించి వయోభారాన్ని మోసే
శరీరాన్ని వేరు చేసి
వద్ధాశ్రమంలో వేయడం
పిల్లకు తగునా !
మమతలు పాత రేసి బందీ చేయడం
క్షమింపరాని నేరం కాదా !
కొడుకు బిడ్డల పిల్లలతో ఉంటేనే
సంతోషాల మేళ
కూలీ ఇచ్చి చేయించిన సేవ
సాకారం కాని కల
వద్ధ ఆశ్రమాల విష సంస్కతికి
మంగళం పాడాలి
చివరి క్షణాలలోనైనా
తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం నింపాలి.
పిల్లలతో మమేకమే
ఊపిరై ఉయ్యాలలై ఊగాలి
కమ్మని భావం కన్నీరై చిందితే
రక్త బంధం ఆవిరై చిలికితే
జన్మ నిచ్చిన వారు దిక్కులేని వారే కదా ! నేటి తరం పిల్లలలో పెను మార్పులు రావాలి
వద్ధులు పిల్లలతోనే వెన్నంటే ఉండాలి.
- పూసాల సత్యనారాయణ
9000792400