Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినరా వినరా మానవుడా..
తెలుసుకోరా నరుడా
పచ్చని ప్రకృతిని నేనే రా
ప్రాణ వాయువు నేనే రా
నీలోని విష వికృతికి
నేను వేదన భరించలేక
ప్రళయ తాండవం చేస్తున్నా
ఉప్పొంగి పరుగులు తీస్తున్నా
నన్నెందుకు కత్తులతో నరుకుతావు
నీకు నువ్వే కోరి బలి అవుతావు
లోకానికి ఎందుకు కీడు తలపెడతావు
నీ స్వార్ధానికి నిత్యం మాయ ఎందుకు చేస్తావు
నువ్వు పుట్టినప్పుడు ఊయలనయ్యాను..
నీ ఇంటి కల్పవృక్షము నేనవుతా
నీకు నీడను ఇచ్చే చెట్టునౌతా
వృద్ధాప్యంలో చేతిఅండగా నీ తోడవుతా
చివరికి నిన్ను కాల్చే కట్టె నేనవుతా...
నన్ను కాపాడితే ప్రాణం ఇస్తా
నన్ను కాదంటే ప్రాణం తీస్తా
చెట్టు నాటితే హరితహారమై
పంచభక్ష పరమాన్నాలు అందిస్తా...
- సస్యశ్రీ...
ఖమ్మం