Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను మీ రక్షకుడ్నని
మాటల మాయతో నమ్మగొల్పుతావ్
మమ్మల్ని ఒంటరిని చేసి
నీ వాట్సాప్ యూనివర్సిటీని ఉసిగొల్పుతావు
ఒళ్ళంతా విషాన్ని నింపుకొని
పైకి దేశానికి గొప్ప నటుడ్ని చూపిస్తావ్
నువ్వు దేశాన్ని తెగనమ్ముకుంటున్నప్పుడు
నీ గెలుపుపై నీకు అపనమ్మకం ఏర్పడుతున్నప్పుడు
మా గతాన్ని తవ్వి
నెత్తుటితో చేతులు శుభ్రపరుచుకుంటావు
మా భవిష్యత్తు మీద
మా మూలాల మీద
మాకే భయంగొలిపేటట్టు చేస్తావు
నెత్తురు మరిగిన మగానివి
పదవితో చల్లారే నీ దాహం
నీటితో తీరేది కాదని మాకు తెలియంది కాదు
ఓ నరహంతక పాలకుడా !
మా !
శిరస్సులే కదరా
నీ పదవి దాహానికి రక్తమోడీ నైవేద్యాలు.
- ఇబ్రహీం నిర్గుణ్