Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నటి వార్తలన్నీ వెతికితే
నిజం కానరాలేదని
నిప్పు భగ భగ మండుతున్నది.
ఎండుకొమ్మ మీద వాలిన
పక్షులన్ని చిగురు కోసం
ఎదురుచూస్తుంటే ఆకాశంలో
మేఘము నవ్వుతున్నది.
గాయాలను దాచిన మాటలన్ని
గేయాలుగా కదలాడుతుంటే
వినలేని హదయాలు
గాఢ నిద్రలోకి జారుకున్నాయి.
మనుషులే లేని ఇంటిలో
గదులన్ని ఖాళీలవుతుంటే
ఫుట్ పాత్ పై మెదిలే అనాధలు
జీవితతత్వాన్ని మోస్తున్నారు.
లేనిచోట
కనలేవు వినలేవు
ఎన్నటికి కనుగొనలేవు ...
నువ్వు కూడా
అచ్చం అలాగే నువ్వులేని చోట
నిత్యం నీకోసం వెతుకుతూ
నిన్ను ఎన్నటికి పొందలేవు....
- రామ్ పెరుమాండ్ల
9542265831