Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పందనారాహిత్య ఎడారి జీవితాన
నాకు హృదయ స్పందనగా మారతావు
కష్టాల మేఘాలన్నో కమ్ముకొని
వెచ్చని కన్నీరు ఉబికి వస్తుంటే
నులి వెచ్చని ఊపిరివై
ప్రాణాన్ని నిలబెడతావు
నా గొంతువింటే చాలు
నా బాధను గుర్తుపట్టే
మనో వైద్యురాలివవుతావు
నాలోని ఆత్మ విశ్వాసానివి
నా సంతోషంలోనే కాదు
నా బాధలోనూ వెన్నంటి ఉండే నేస్తానివి
నీతో మాట్లాడుతూంటే
నన్ను నేనే మర్చి పోయేలా చేసే
మైత్రీ మంత్రానివి
నాలోని బాధలన్నిటికి
ఔషధమయ్యే ఓదార్పువి
కాలేజి మెట్ల మీద మొదలైన
మన స్నేహం కలకాలం
ఇలాగే కొనసాగాలి
ఈ స్నేహానికి హద్దులూ
సరిహద్దులూ లేవు నేస్తమా!!
అజరామరం మన స్నేహం!!
- అనిత దావాత్, 9394221927