Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితాన్ని అనుభూతుల పూలతోట చేసినావు
కణకణమున చెలిమిపూల పుప్పొడినే నింపినావు
కులమన్నది మతమన్నది బంధాలకు సంకెలనే
అడ్డుగోడ కూలదోసి స్నేహగీతి పాడినావు
చెలిమెల్లో నీళ్ళుదాగి చెట్టక్కిన చిలిపిచేష్ట
చెదిరిపోని జ్ఞాపకాల కావ్యాన్నే రాసినావు
నాగుండెకు గాయమైన నీ కన్నులు తడిసిపోయె
దేహాలే వేరుగాని ఒక శ్వాసగ మారినావు
బంధాలే ఆర్థిక అనుబంధాలుగ మారుతుంటె
నిస్వార్థపు మైత్రి నాకు కానుకగా ఇచ్చినావు
రహస్యాల గూఢచారి స్నేహితుడే లోకంలో
భూగోళం బద్దలైన లోలోపల దాచినావు
అవసరాల స్నేహాలే చీకటిలా వ్యాపించెను
ఓ చంద్రుడ! స్వచ్ఛమైన వెన్నెలవై కురిసినావు!!
- వెన్నెల సత్యం