Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం చరిస్తునే వుంటుంది
ఒక్కోసారి నత్తలా నడుస్తూ
మరోసారి
చిరుతలా దొర్లుతూ పరిగెడుతూ.
జీవితం తరిస్తుంటుంది
ఒక్కోసారి ఖేదంతో ఏడుస్తూ
మరోసారి మోదంగా నవ్వుతూ.
కాలం తుది తెలియని వాహిక
జీవితం ఎడతెగని దప్పిక.
కాలం నిత్యచలనశీలి
అయినా
స్థితప్రజ్ఞ దాని లక్షణం.
అసంగతి తెలియకుండా
జీవితం కూడా
తనతో పోటీ పడుతుంది.
నిజానికి
కాలచక్రం, జీవితవలయం
అద్వైతానికి ప్రతీకలు.
జీవితమంటే
కాలనదికి ఒక పాయ,
కాలమంటే
జీవన ప్రకాశానికి ఒక ఛాయ.
- కుడికాల వంశీధర్,
9885201600