Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం చాలా చిత్రమైనది
కాలం అందరికీ శిక్ష విధిస్తుంది
కాలంతో పాటు నడుస్తూ
నువ్వు నువ్వుగా మిగలలేదు
నేను నేనుగా మిగలలేదు
మనసు మాయలో పడిపోయాము
ఒకనాడు కలుసుకున్నాము
ఇంకెప్పటికి విడిపోమని భ్రమపడ్డాము
ఒకే దారిలో కలిసి రెండు అడుగులు నడిచాము
నీవెక్కడో తప్పిపోయావు
నేనెక్కడో తప్పిపోయాను
ఏదో దారిలో వెళ్తున్నాను
ఎటు పోవాలో తెలియడం లేదు
దారి కూడా కనబడడం లేదు
ఏదో వెతుకుతున్నాను
అంతా శూన్యంలాగ కనిపిస్తోంది
మనసు విరాగిగా మారిపోయింది
కాలం అందరికీ శిక్ష విధిస్తుంది
- అరుణ డేనియల్, 9000606889