Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడుస్తున్న చరిత్ర
ఏ సిరాతో రాయబడిందో!!...
ఎవరికీ అర్థంకాని
ఓ భయంకర కాలుష్యం
మనుషులను వెంబడించి
ఓ కాలసర్పమై
ఎందరెందరినో కాటేస్తుంది!!..
ఇది ఎవరికీ అర్థంకాని
ఓ అసమానతల చరిత్ర!!...
పరిఢవిల్లని మానవ ప్రగతిదారి...
పురులువిప్పిన ఓ పైశాచిక ప్రవృత్తి...
గతాన్ని తొక్కేసి... హితాన్ని మింగేసి
ఓ కొత్తతరహా ఇతిహాసమై...
కుటిల నీతితో మమత మేడల్ని...
మానవత్వపు గోడల్ని...
కూల్చేసింది!!...
వ్యక్తుల వికాసపు
అజ్ఞాననేత్రం తెరిపించి...
సమానత్వపు దార్లని తెంపేసి...
వెలుగుల విలువల్ని నలిపేసి
ఎంతో లోతుల్లోకి... నెట్టి
చరిత్రను తొక్కేసింది!!...
అన్నీ సమస్యలు సందేహాలే
నిరాశల నిప్పుల సెగలే
అసమానత... అవమానాలు...
పచ్చనోట్ల మీద... ఇప్పుడు
ప్రపంచం పరుగులు తీస్తోంది!!...
మంచితనాన్ని మరుగున పడేసింది!!...
మనుషులలో స్వార్థము పెరిగి...
ఓ రకమైన మృగాలై...
మనషులనే పీక్కు తింటున్నారు!!...
ప్రేమ జాలాన్ని వదలి ఇంద్రజాలంతో...
ఎందరెందరినో పీడిస్తున్నారు!!...
కనికట్టుతో కళ్ళను కప్పేస్తున్నారు!!...
స్వార్థముతో అందరినీ...
స్వాహా చేస్తున్నారు!!...
పురుష అహంకారంతో...
కళ్ళు మూసుకుపోయి...
కన్ను మిన్ను కనబడక...
కనిపించే మహిళలను కాటేస్తున్నారు!!...
మాన... ప్రాణ... ధనాన్ని
పోగొట్టుకున్న నేటి ఈ...
కన్నీటి చరిత్రను
ఏసిరాతో రాశారో!!??...
మూఢనమ్మకాల ముసుగులో...
మునిగిపోతున్నారు!!...
కాశీ మజిలీ కథలు...
కల్లబొల్లి మాటలతో...
ఎందరినో మభ్యపెట్టి దోచేస్తున్నారు!!...
కనబడే సత్యాన్ని కాళ్లతో తన్నేసి...
వినబడే అసత్యాన్ని అనుసరిస్తారు!!...
మనిషికున్నలక్షణాలు
ఏనాడో మరిచిపోయారు!!...
ఎక్కడికెళ్తున్నాడు మనిషి!!...
ఈ చరిత్ర సరియైనది కాదు...
కన్నీళ్లు తెప్పించే చరిత్ర
కళ్ళముందు కనిపించొద్దు
మనుషులో పరివర్తన తేలేని
చరిత్ర మనకొద్దు
ఆలోచించండి!!...
మనుసు బెట్టి...
చేయిచేయి కలపండి!!...
ఈ చరిత్రకు స్వస్తి చెప్పండి.
- అంబటి నారాయణ,
సెల్:9849326801