Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లె పచ్చగ వెల్లివిరిసి.. నవ్వుతుంటే చీకటెక్కడీ
బడుగు బ్రతుకుల.. ప్రగతి కోరే మనసు వుంటే చీకటెక్కడీ
చేతివత్తులు చేవ పుంజుకు.. ఆధునికతకు చేరువాయెను
పట్టుగొమ్మలు ఛాతి విరుస్తు..నడుస్తుంటే చీకటెక్కడీ
గడప గడపకు సరస్వతమ్మ..స్నేహ హస్తము చాచి నిలచెను
వెట్టి వెతలకు గట్టి జ్ఞానము.. దొరుకుతుంటే చీకటెక్కడీ
నల్లమబ్బులు చిందులేస్తూ..నేలమ్మతో కలిసి నడిచెను
తనివితీరా చేను చెలకను..హత్తుకుంటే చీకటెక్కడీ
భూతదయతో ప్రజానీకము..హదయాంజలి సమర్పించిరి
కాలుష్యమే తోకముడిచీ.. ఉరుకుతుంటే చీకటెక్కడీ
ఒకే గొంతుక,ఒకే భావము..రంగు వెలుస్తూ చిన్నబోయెను
నిజం తెలుసుకు నరుడు నరుడై.. బతుకుతుంటే చీకటెక్కడీ
పూనకాలకు, జంతుబలులకు.. వంగి వంగీ వందనాలే
జనుల మదిలో మూఢపుపొరలు..తొలగుతుంటే చీకటెక్కడీ
(గతి : మిశ్రగతి)
- సోంపాక సీత, 8639311050