Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : నువ్ అమ్మెరు అమ్మెరు అంటాంటే
మా ఇల్లేగుల్లైపోయినట్టుందిరా సామి...మా సామి
నిను నమ్మి నమ్మి ఉంటాంటే
ఈ దేశం మొత్తం అమ్మెత్తావేమిరా సామి.. మా సామి
నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే... ఏ
మేం ఎనకేబడి పోయినట్టుందిరా సామి
నీ ఎక్కా సెక్కాల్ సూత్తావుంటే
ఎక్కెక్కి ఏడ్సినట్టుండిరా సామి
నువ్ ఎల్లే పోకడ సూత్తా ఉంటే
కొంపే కొల్లేరైనట్టుందిరా సామి నా సామి
మా సామి.... పోరా సామి
బురిడీల సామి... గారడీల సామి
గడ్డాల సామి
మా సామి (సామి)... పోరా సామి (సామి)
బురిడీల సామి... గారడీల సామి
గడ్డాల సామి
చరణం : సుక్కల పైదాకా.... గ్యాస్ ధర పెంచిపెడితే
సుక్కల పైదాకా... గ్యాస్ ధర పెంచిపెడితే
మా పంచ ప్రాణాలు పోయెను సామి
కార్పోరేట్ కంపేనీకి... ఉన్నయన్ని కట్టబెడితే
మా కళ్ళు ఎర్రగా మండేను సామి
ఆ రైతుల కేకలు ఇంటా ఉంటే
ఏ ఏఏ ఏ ఏ ఏఏఏ ఏ ఏ
ఆ లేబర్ చట్టాలే సూస్తే
దులపరింపులే సామి
నువ్ లూటీ మీద లూటేసేస్తే
శాపనాలే సామి
దేశ సంపదను మెక్కి
నష్టము సూపిత్తే
ఇంగులాల లెక్క రగిలీపోతాం సామి నా సామి
(నా సామి... రారా సామి)
చరణం : రైలు విద్యుత్ టవర్లంటే..ఏ... ఓడరేవు గోడౌన్లంటే
బొగ్గుబాయి విమానాలే... ఒక్కక్కొటే అమ్ముకుంటే
ఉన్న ఇలువ సున్నా అవదా సామి
మా చెవుల్లోన పువ్వులు పెట్టీ
ఉన్నయన్ని అమ్మూతుంటే
పేద గుండె గాయ పడదా సామి
కళ్ళు మూసి పాల్తాగేటప్పుడు నువ్వూ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
ఎంతకైనా దిగ జారేటప్పుడు నువ్వే
సుట్టుసూడకుంటె సామి
ఈ లోక మంతా నిన్నే చూసి
అవ్వా అనదా సామి
ఈ దేశం మొత్తం గిర్వెట్టకుంటే
నిద్రే పట్టక ఏమైతావో సామీ... నా సామీ
(నా సామి.. రారా సామి..)
''పుష్ప''(2021) చిత్రంలోని ''నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే'' పాటకు పేరడీ. రచన: చంద్రబోస్.
- డా. బి. బాలక్రిష్ణ,
9948997983