Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి ఒడినిండా
పూల వనాలు ఉన్నాయి!
కాలి బాటన వెళుతుంటే నవ్వుతూ పలకరిస్తాయి!
పైపైకి ఎగబాగుతూ పూలతీగలుగా అల్లుకుంటాయి!
పరిమళాలు వెదజల్లుటకై పువ్వులై వికసిస్తున్నాయి!
ప్రేమను పంచుటకై పరితపిస్తూ ఉంటాయి!
సూర్యుని రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాయి!
స రి గ మ ప ద ని స లతో పాటలు
పాడుతుంటాయి!
ఎరుపైన పెదవులతో వేణువు ఊదుతుంటాయి!
కాలికున్న మువ్వలతో నాట్యమాడుతుంటాయి!
వాలు కనుల చూపులతో సైగలు చేస్తువుంటాయి!
తుంటరి నవ్వులు విసురుతూ చేయి పట్టుకుంటాయి!
శిశిరములో సైతం వసంతాలను పూయిస్తూ ఉంటాయి!
కోకిల గానంతో మైమరిపిస్తాయి!
కారు మబ్బులను కరిగించి వానలుగా కురిపిస్తాయి!
సముద్రం అలలను మళయా సమీరాలుగా మారుస్తాయి!
మనిషిలోని మాన వత్వాన్ని నిదురలేపుతుంటాయి!
మానవ సమాజానికి ప్రేమ సందేశాన్ని అందిస్తాయి!
- ఎస్. జవేరియా, 9849931255