Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు అన్నీ
పచ్చి ,పచ్చిగానే కనిపిస్తున్నాయి
పొద్దు పొడుపు నుండీ
పూల పొదరిల్లు వరకూ
పచ్చ,పచ్చగానే కనిపిస్తున్నాయి
చలికి కాబోలు
సూర్యుడు మంచు దుప్పటితో
ముసుగేసుకొని చలి,పులి పాటల్ని
గోరు వెచ్చగా వినిపిస్తున్నట్టే ఉన్నాడు
నిశబ్దాన్ని తలకు పోసుకుంటూ
ఊరి చెరువు శబ్ధ రాగాన్ని మరచినట్టే ఉంది
ఊరి కొండలు ఇంకా
ఎర్ర రంగు పులుముకోలేదు
చెట్లు మరింకా గాలి పాటల్ని అందుకోలేదు
పక్షులన్నీ ఏ గూటిలోనో
గుప్తంగా నిద్రను నిమురుకొంటూనే
నిశబ్ద కలల్ని నేమరేస్తున్నట్టే ఉన్నాయి
పల్లె,పల్లెంతా
చలి గూటిని చేరినట్టే ఉంది
కోడి..., కూతను మరచి
గంపను వీడనంటూ
గొంతును తడుముకొంటునే ఉన్నట్టుంది
తోటపై వాలిన పదాల పిట్ట
తూనీగలా త్రుళ్లింతల పాటను
పొందికిగా ఆలాపన సాగిస్తోంది...!
- మహబూబ్ బాషా చిల్లెం, 9502000415