Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపం వెలుగులో నీవున్నా
నీ నీడ నీ వెంటే కదా!
వెలుగునే ఇష్టపడే నీవు
అజ్ఞానాంధకారాన్ని తొలిగించుకోవేల!
చీకటికి ఏమి తెలుసు
వెలగాలంటే ఎన్ని వెతలో
వెలిగేటివన్నీ తమను తాము
ఎల్లప్పుడు ఎంత దహించుకుంటున్నవో!
వర్షం వస్తే హర్షించే వారికి
వర్షం పడకుంటే నిందించే వారికి
అలుపెరుగక పయనించి వర్షించే
మేఘాల ఎలినినో దెబ్బలేమి తెలుసు!
జలపాతం అందాలలో
కేరింతలు కొట్టే వారికి
ఒడ్డు నొరుసుకుంటూ పారే
ఏటి నీటి ఒంటి కష్టాలేమి తెలుసు!
వెలుగుతున్న వారంతా
ఎన్ని చీకట్లను తరిమినారో!
ఎంత శ్రమను ఇంధనంగా జ్వలిస్తూ
సూర్యుని లా నిరంతరం వెలుగుతున్నారో!
- పి.బక్కారెడ్డి, 9705315250