Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకం అమ్మ- నాయినే నాకు.
అమ్మ కాబట్టే....
ఆయువయింది...
అన్నమయింది....
అక్కునచేర్చుకుంది...
ఆలంబనయింది.
నాయిన కాబట్టే
ఆట-పాట- మాట-
ఆలోచనయింది....
లోకంరీతి తెలిపింది.
ఇప్పుడు... అమ్మ-నాయిన లేకున్నా....
పుస్తకం ఆత్మై నిలిచింది.
ఆనందం... అక్షరాలై వర్షిస్తున్నరు.
అయినవాళ్ళెవరూ లేకున్నా...
తోడుండేది... మందలించేది.... పుస్తకమే.
మొకాన కళనిచ్చేది...
మెప్పును కలిగించేదీ పుస్తకమే.
చేతికలంకారమూ పుస్తకమే.
అసలు... నాపుస్తకాలు చూస్తేచాలు...,
నా గురించి తెలుస్తుంది.
నలుగురికి తెలుపుతుంది.
నలుగురినొక్కచోట చేరుస్తుంది
- అనుముల ప్రభాకరాచారి
9676549963