Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే నాలుగు అడుగులు వేద్దామంటే..
చుట్టూ ఓ పొర
ఊళ్ళో అయితే మంచు అంటారు ..
సిటీ కదా...
కాలుష్యం అంటారంట
అలా నాలుగు అడుగులు ముందుకేస్తే..
ఓ కాలువ ..
నురగ తప్ప నీరు కనిపించదే..
అదే ఊళ్ళో అయితే.....
సబ్బు నురగ అనేవాళ్ళు
కిక్కిరిసిపోయిన ఇరుకు మనషు(సు)లు కదా..!
కెమికల్స్ ఎఫెక్ట్ అంటూ స్టైల్‌గా చెప్పాడు
ఇంకో అడుగు వేస్తే
పొగలో దారి కనపడక జారిపడ్డ బండి ..
దాని కింద నడిపే మనిషి
పరిగెత్తుకు వెళ్ళిలేపితే
మానవత్వం అన్నారు..
అదే ఊళ్ళో అయితే బాధ్యత అనే వాళ్ళు..
అంతేలే దేవుడికేస్తే .. కానుక
మనిషికి వేస్తే బిక్షం అన్నప్పుడే
అర్థం చేసుకోవాల్సింది..
ఒకే గుడి పరిసరాల్లోనే
ఇంత బేధమున్నప్పుడు
వేరు వేరు పరిసరాలు
తీరొక్క ప్రాంతాలు
మాటలే కదా ..
ఎంత సేపూ ..
ఇట్టే మారిపోతుంటాయి..!
అయినా విలువలు కొరబడినప్పుడే ...
ప్రతీ చిన్నది మ్యూజియంలో
చూసే వింత వస్తువవుతుంది.
- గుడిసె రాజశేఖర్, 9885717740