Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్ల పుట్టిందంటే శాపాలు ఎందుకు
వేప పూతలా చేదు కాదు కాదా
ఆడదాని బతుకు లేని లోకం ఎట్టిది
తేనె కంటే తిని తానేగా..
చల్లని వెన్నెల తానై..
తల్లిగా, ఆలిగా, చిగురించిన పచ్చని తోరణమై..
నట్టింట్లో కూతురిగా, కోడలిగా..
పసిడి పంటల సిరి సంపదలు తానివ్వదా..
హారతీ వెలిగిన ఈ జగతికి పడతే మూలం
పడతే కాదా సర్వం
అనురాగం అంటనే ఆడది
మామకారం అంటనే ఆలిది
కన్నోళ్లో కాలుపట్టి కాటికి తోలే
ఈ సమాజాన్ని ఎవరు అదుపు చేస్తారు
ఆడపిల్లన్నీ ఎవరు పొదుపు చేస్తారు
యుద్ధంలో కత్తిదూస్తే బాళ్లేంలా
అడ్డుకోవడానికి ఏ వీర నారిమణి వస్తుంది
రాక్షసులు లాంటి ఈ దుసమాజ చెర నుంచి
ఎవరు రక్షిస్తారు..
ఆదేశ వలయాన్ని అడ్డు తెరను
ఎవరు తొలగిస్తారు..
కండ్లలో కామం ఒళ్లంతా నిండి
కన్నీళ్ల స్నానాలు చేయిస్తూ
పగబట్టిన పాములా రాక్షసం పొంగుతుంది
నీ తల్లి ఒక్కతే ఆడదా...భూదేవి అంతటి గొప్పదా
నీ చెల్లీ ఒక్కతే తోడుదా.. ఆకాశం అంతటి నీడదా
నీ అలి ఉండగా అండగా.. నీలోన చేరదా నిండుగా
వేపకు పులుపంతా చేదుగా చూసేటి లోకాన
ఆడది అందరికీ అలుసైన ఎర్రిది..
పగిలిన ఓ గాజు బొమ్మ..!
- అకునమోని రచన