Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
పని చేసిన కాలానికి, క్లెయిమ్ చేసిన గంటలకీ
పని చేసిన కాలానికి, క్లెయిమ్ చేసిన గంటలకీ
పొంతనే లేకున్నా
తామే పనిమంతులమని చెప్పుకుందురన్నా
పని వేళ ప్రతి మెప్పు నిజమే అనుకున్నా
తేనె పూసి విరిసిన అసి నేడే చూస్తున్నా
పని చేసిన నేరానికి కనిపించని భారానికి
పని చేసిన నేరానికి కనిపించని భారానికి
నిత్యమూ చస్తున్నా
నేనే మరమనిషిగా మార్పు చెందుతున్నా
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
లేచి పడుతు వున్న స్ప్రింటు చక్కగ నడపాలనీ
అందరినీ కలుపుకుంటు గెలుపుని చూపాలనీ
లేచి పడుతు వున్న స్ప్రింటు చక్కగ నడపాలనీ
అందరినీ కలుపుకుంటు గెలుపుని చూపాలనీ
వచ్చిన మేనేజర్‌నే పిచ్చి వాడు అనుకున్నా
చల్లారిన స్ప్రింటుకి తన కొత్త శక్తినిచ్చి
తోడైన తన ముందు ఓడానా? గెలిచానా?
మెప్పు పొందినప్పుడు నువ్వు గొప్పకు పోవద్దు
తప్పని అన్నప్పుడు చిన్నబుచ్చుకోవద్దు
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
రోజే గడిచింది ఇంకా పని వుంది
కడుపు మండి పోతున్నా పని చేస్తున్నాను
కాచుకున్న డెడ్‌లైన్స్ గెలిచే సులువేమిటో
కాటును దాటొచ్చిన నువ్వు చెప్పు వింటాను
జట్టుగ కదలాలి జగజ్జెట్టిగ నిలవాలి
కళ్లు నెత్తి కెక్కకుండ పనిని చేయాలి
మత్సరాలు మనసులోన లేకుండా ఉండాలి
టీం స్పిరిట్ విలువ తెలిసి ముందుకు సాగాలి
ఎన్నేళ్లు పని చేసిన అనుభవమే గురువురా
ఒకరికొకరు తోడుంటే గమ్యం మనదేరా
ప్రాజెక్టు ఏదైనా నీతి ఒక్కటే అన్నా
పనినే దైవంగా భావించరా చిన్నా
''ఇద్దరు ఇద్దరే'' చిత్రంలోని ''ఓనమాలు నేర్పాలని'' అన్న పాటకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణపై పేరడి
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కుడికాల వంశీధర్, 9885201600