Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుక్క పొద్దు పొడిచినది మొదలు
బాధ్యతల రెక్కలు కట్టుకొని
పొద్దు పడమటికి ఒరిగినా
పదో.. పరకో..
పంటి బిగువున కరచుకోనిదే
గూటికి చేరని పిచ్చుక బతుకు
కష్టాల అలలకు ఎదురీదుతూ
కన్నీటిని దిగమింగుతూ
కడుపునెండగట్టుకొని
పరక పరకను పోగుచేసి
సీకటి కమ్మిన వెలుతురుకు
కాసింత ఎన్నెలలు వెదజల్లే
కలల గూడుకై
బతుకంతా కలతలే..
పేగును తెంచుకొని
పురుడోసుకున్న పిల్లలకై
సత్తువను కరిగించి కట్టుకున్న
కమ్మని కలల పాన్పుకై
కష్టాలను మరచి..
అనుబంధాలతో....
ప్రేమాప్యాయలతో...
పేగు బంధాలతో...
అల్లుకున్న అందమైన
అందమైన ప్రపంచమే
ఈ పిచ్చుక గూడు..!!
- ముక్కాముల జానకీరామ్
6305393291