Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నదిలో
నీరులా
నే ప్రవహిస్తూనే ఉన్నా
నీ ప్రేమలో
తీరమై
అడ్డుకుంటావో
సముద్రమై
నను నీలో చేర్చుకుంటావో....!!
గాలిలా
అలుపు లేకుండా
నే సాగుతూనే ఉన్నా
నీ పిలుపు కోసం
హిమాలయమై
అడ్డుకుంటావో
శ్వాసించి
నను నీలో బందిస్తావో....!!
మెరుస్తున్న
మేఘంలోంచి
నే జారిపడుతున్న
వాన చినుకుని
వరదల్లో
వదిలేస్తావో
ముత్యపు చిప్పవై
నను నీలో దాచుకుంటావో....!!
- సేనాపతి
8309552856