Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏం సాదించాలి అనే ప్రశ్న
సమాజాన్ని అధ్యయన పరిచే
నాగరికతలో వెల్లువెత్తున విరిసే
కొబ్బరి చీపితో తాడు నేసినట్లు
విజ్ఞాన ఆలోచన వడబోసినట్లు
విజయం కోసం అంతర్గత అన్వేషణతో..
పట్టుదల వదలని ప్రశ్న వెంటాడుతుంది
లక్ష్యం మిళిత భాగమై కక్షలు దాటి
చెట్టుకొమ్మ పై నిషిధ రాత్రుల్లో
రైలు పట్టాలపై ఎక్ష్ ప్రెస్ లా వెళ్తుంటారు
వినోదానికి అలవాటు పడ్డ దేహాలు
ఓటమి జీర్ణించుకోలేక
కన్నీళ్లు ఉండలేక ఉండవు
ఆశయాలు ఆచరణలేని
సదువు అపహాస్యం చేస్తూ
చతుర్భుజ బూడిద వర్ణంలా ఉంటాడు
కష్టాల కుస్తీలకు జేజేలు
ఎటు దాపరిస్తుందో తెలియని కొత్త మజిలీ..
తిర్యగ్ రేఖలా తిరుగుతూ ఉండి
ఎర్త్ మువర్ లా నిలబడి
పరివర్తన అపసవ్యంలా ఉంటాడు
ఏమి చేయాలో బెరీజు వేస్తూ
గాయాలను వెతుక్కుంటూ
నిప్పు రాజుకున్నట్లు విజయ అంతరంగాన్ని
సదువే ధ్యాసై అడుగు వేస్తాడు
వంతెనలా సౌందర్యవంతమైన మార్గాన్ని
కన్నీళ్లను అమ్ముకున్న విజయ తపస్సుని
సాధించే ప్రశ్న అణువణువునా
వర్తమాన అంతరంగంలో ఉంటది
సదువు వెంట ఉండి నడిపిస్తాయి
ఎన్నో అవరోధాలా నడి ఒడ్డున
వేధిస్తున్న కాలానికి ప్రశ్న అవసరం
నాటు కొడవలిలా సదువును సానబట్టి
వెతుక్కున్న విజయానికి గమ్యం సదువు అన్ని వేళ్లపై లెక్కిస్తే రెక్కలకు కాళ్లు తొడిగిస్తే
ప్రతి ప్రశ్నకు నిరాశా నిస్పృహ లేకుండా
ప్రశ్న నినదించే విజయపథంతో వెలుగునింపే
పిడికిలి బిగించి ముందు ఉంటది
సమస్య పరిష్కారానికి ప్రశ్న విజయసంకేతం..!!
- బూర్గు గోపిక్రిష్ణ, 7995892410