Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీకటి సామ్రాజ్యం
వాడికి చేతిలో చెయి వేసి చెప్పిందట-
చివస్థాయిగా నీతోనే చెలిమి చేస్తానని!
రాకాసి నీడ తన బిగి కౌగిలి
బంధించి మరీ భరోసా ఇచ్చిందట-
రక్షణ కవచంగా (సదా) నీతోనే నిలుస్తానని!
దుశ్శాసన పర్వం శాసనం చేసిందట వాడి కోసం-
తమ బలిమి నిత్యమై వెలుగుతుందని!
అబద్ధాల అద్దాల మేడలో
వాడు వికృత రూపంలో వికటాట్టహాసం చేస్తున్నాడు...
కాలం తిరగబడింది-
ఎన్ని నాళ్ళ నిరీక్షణ...
ఈ క్షణం కోసమే నా తపనంతా...
ప్రాభాత సమీరం మెల్లమెల్లగా వీస్తున్నది.
అరుణారుణ రేకలతో
తూరుపు వాకిలి తెలతెల వారుతున్నది
చీకటి కొట్టానికి అంటుకున్న మంటలు
చిటపట ధ్వనులతో మరో ప్రపంచానికి
స్వాగత గీతికలు ఆలపిస్తున్నది
- జీవన్,
7981530448