Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఋతువు మార్పులు/
గాలి తేమ చేర్పులు/
పంటల నూర్పులు/
ఈ దేశంలోఒక్క రైతన్నకు
గాక/ వేరెవరికి తెలుసు?
భూమి నాడీ నిదానం ఎరిగిన వైద్యుడు రైతంటే!
పంట బరువు భూమిపై
వాలేప్పుడు/నిండు గర్భిణిని తల్లిలా జాగర్త
తో చూసేవాడు రైతంటే..
చెమటతో తడిసిన పంట
చేతి కందేప్పుడు/అతని
కనుకొలుకుల్లో ఆశల మెరుపుల జాడలు.../
తూరుపుదిశ వరదగుడేసి
నప్పుడూ../ పడమట నల్ల
మబ్బు అట్టలుఅట్టలుగా
తారాడినప్పుడూ /ఉత్తరాన ఉరుముఫెళ
ఫెళాయించి నప్పుడూ/
దక్షిణానచినుకు,చినుకులై
రొద జేసినప్పుడూ/రైతన్న
ఆనందం ఆకాశంలో
సింగిణీల మెరుపై తుంది...
మొలిచిన అతని చేతుల
రెక్కలు రేపటి వెలుగు పులుగులై గగనతలాన్ని
స్పశింపిస్తాయి/
భూమిఆకాశంపశువులూ
పక్షులూ/తనను మోసం
జేయవనే నమ్మకం, అతడి
నొక వింధ్యగిరిని జేసి మబ్బుల్ని తాకిస్తుంది/
ప్రకతి చేతుల్లోమోసపోని
రైతు దళారుల మాటల్లో
మోసపోతున్నానని తెలుసుకుని /కటిక రాజ
కాపరులమీద కన్నెర్ర జేస్తు
న్నాడు/తోకతొక్కినతాచు
లా బుస కొడుతున్నాడు/
అడుగుఅడుగుపదునులో
తన వ్యధను అదునుగా
అష్ట దిక్కులూపిక్కటిల్లేట్టు
వినిపిస్తున్నాడు/పంజాబు
పూరించిన శంఖారావం,
సముద్రఘోషతోమిళితమై
దిశలలమిన కార్చిచ్చు లా
దుశ్శాసనారణ్యాలను
దహించుతోంది/ప్రలోభాల
ఆశలఎరలకులొంగకుండా
సాగే తిమింగలంలా ఈ
ఉద్యమసంద్రంలోఈదే
రైతుకు,కష్టజీవుల పక్షాన
జే జే లు పలకాల్సిందే!
కాలపు పరీక్షలో జయ
కేతనం ఎగురెయ్యాలసిందే!
- డా.పొత్తూరి వేంకట సుబ్బారావు