Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంటురోగం కరోనా బాధ తీరనే లేదు
పంట లేవీ ఇంటికింకా చేరనేలేదు
రైతు కంట నీటి తడి ఆరనే లేదు
ఆకలి మంటలు చల్లారనే లేదు
గూడు చెదిరిన వలస జీవికి
నీడ కరువు
ఉపాధి లేని సగటు జీవికి
బతుకు బరువు
బంధుమిత్రులు కలిసి ఉన్నా
సందడేమో నిండు సున్నా
నిండా మునిగిన వేళ ...
పండగొచ్చినా .. మరో గండమొచ్చినట్టే
నెత్తిపై ఇంకో బండ పడ్డట్టే.
- డా. డి.వి.జి.శంకర రావు,
94408 36931
మాజీ ఎంపీ, పార్వతీపురం.