Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవులపల్లి రచనలపై స్పందనా వ్యాసాలకు ఆహ్వానం
ప్రముఖ కథకులు, నవలా రచయిత దేవులపల్లి కృష్ణమూర్తికి 80 సం||లు నిండిన సందర్భంగా 'జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక' ఆధ్వర్యంలో అభినందన సంచిక వెలువరించాలనుకుంటు న్నారు. ఇందుకు ఊరువాడ బతుకు, బయటి గుడిసెలు, మూడు ముక్కలాట, కథలగూడు, తారుమారు, యక్షగానం తదితర రచనల మీద వ్యక్తిత్వం మీద రచయితలు, మిత్రుల నుంచి స్పందనా వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మార్చి 31లోగా 7981701220, 7981457092 వాట్సాప్ నెంబర్లకు పంపవచ్చునని నిర్వాహకులు ప్రకటించారు.
10న అంతర్జాతీయ అంతర్జాల సదస్సు
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 10న తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలె వర్ధంతి సందర్భంగా ''ఆధునిక భారతీయ కవిత్వంలో మహిళా చైతన్యం'' అనే అంశం మీద అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 10న ప్రభుత్వ సిటీ కళాశాల, తెలుగు శాఖ, తెలంగాణ సాహిత్య అకాడెమీ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 10 గం|| - సాయంత్రం 4:45ని||ల వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నవీన్ మిట్టల్, ఐఏఎస్.; డా|| ప్రిన్సిపాల్ బాల భాస్కర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆచార్య కాత్యాయని విద్మహే, శ్రీమతి అవధానం సుజాత, డా|| నీరజ తదితరులు పాల్గొననున్నారు.