Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలప్యాకెట్లలా
పరిపాలన కూడా కలుషితమైంది
బాధ్యత
ప్రయివేటు సంకలో దూరి
సంక్షెమాన్ని షీడెక్కిస్తున్నది
రాబందులను పెళ్లికొడుకుల్లా ఊరేగిస్తున్నరు
పువ్వుల
నకిలి తనం బయట పడింది
రాముల బాణాలు
పదునెక్కుతున్నవి
శంబూకులవదలే..!
నీడల్ని నిలువునా కూల్చేస్తున్నరు
ఆసరయ్యే చేయుతల్ని విరిచేసేస్తున్నరు
కన్నీటిని తూడ్చే కారుణ్యాలను మూసేస్తున్నరు
ధర్మాదర్మాలు యిష్టాయిష్టాలాయే
ప్రయివేటు గేట్లకు
''టామీల్లా'' ప్రభుత్వ రంగాలు
సంక్షేమాలు
సంతలో పాతబట్టల మూటలైతున్నవి
భరతభూమి
కార్పొరేట్ భూమిగా మారుతున్నది !
పెద్దదేవరకాడ దున్నను కొట్టినట్లు
ఒక్కోక్క సంస్థను గొంతు కోస్తున్నరు
సరిహద్దుల్లో ఉష్ణోగ్రతల్లా
యదేచ్చగా మండుతున్న ధరలు
కన్నార్పకుండా కత్తులు దూస్తూ
అన్నింటిని పాతరేస్తున్న '' ఆత్మనిర్భర్''
అమ్ముకోవడమే అభివద్ది
అమ్మడమే జాతీయవాదం
అమ్మడమే
ఏకత్వం,హిందూత్వం బందుత్వం
అన్నింటిని అమ్ముకున్నోడు
అమ్మను అమ్ముకుంటడు
ఓ చాయివాలా !
అన్నింటిని అటుకులకే అమ్ముతున్నవు
భూమిజి
నిన్ను అమ్మడమే మిగిలింది
- వనపట్ల సుబ్బయ్య,
9492765358