Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీతాకోక చిలుకలు
చిత్రంగా చక్కర్లు కొడుతుంటే
ఏమిటో అనుకున్నా...
పూల తోట కదులుతోంది
బుడి బుడి అడుగులతో..
సింగిడి వర్ణాలనద్దుకుని
పరిమళాల పతాకాన్ని ఎగురేస్తూ...
దారంతా రాల్చిన నవ్వుల పూలను
మైమరచి ఒడినింపు కుంటున్న
కంటి రెప్పలు...
చూపుల పహారాలో
సీసీ కెమెరాలకు పట్టు పడని
అనుమానపు కళ్ళు...
కంటకాల గచ్చ పొదలుంటాయని
తెలియక పరుగులు తీసే పాలవయసు
మల్లె పూల్లా స్వచ్ఛంగా...
పాపిష్టి మిడతల దండు పొంచి ఉంది...
మన ఆరో ప్రాణమైన పూల తోటలను
ధ్వంసం చేయడానికి...
పదండి పోదాం.. రక్షించుకునేందుకు
అంతరాత్మల నెట్ వర్క్‌ను
అనుసంధానం చేద్దాం
అగంతకుల ఆచూకీ పసిగడదాం!
కదులుతున్న పూల
తోటలను కాపాడుకుందాం..
- వురిమళ్ల సునంద,
9441815722