Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దారులు మొత్తం మూసేసి
ఒక్క దారికే ఎదురు కూర్చున్నా
పాత జ్ఞాపకాల బుట్ట
తలపై మోసుకొస్తావని
విడిది చేసిన ప్రదేశాలన్నీ
ఉండగా చుట్టేసి
చంకలో పెట్టుకొని తిరుగుతున్న
ఏకాంతంలో పరిచి
నీ కాంతిలో పవలించాలని
మన ఊసులన్నింటిని
పదాలుగా పేర్చుతున్నా
వాటిని వాక్యాలుగా అల్లుకుని
నీ మనసు గుమ్మానికి
అలంకారంగా వేలాడదీయాలని
ఈ రోజు వచన కావ్యంతోనే
నిన్ను ఆరాధిస్తూ నిరీక్షిస్తున్నా
నా భావం నీ పెదవువలపై
ఒలికితే తనివితీరా చూడాలని
ప్రేమికుల రోజుకు
రంగులు అద్దే పనిలో వున్నాను
సంతోషాల హరివిల్లు దారిలో
పొదరిల్లు మాటున
వసంతాన్ని పూయించాలని
- నరెద్దుల రాజారెడ్డి ,
ఫోన్ : 9666016636