Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవితాకాశపు తూరుపు అంచున విరిసిన అక్షర నక్షత్రాల రంగుల హరివిల్లు 'నెయిసెస్'
అవును అదొక సప్తవర్ణాల మేళవింపు! నులివెచ్చగా గిలిగింతలు పెట్టే నారింజ రంగు అనుభూతుల ఆత్మీయ రాగాలే కాదు, చీకటి వాకిట పరచుకున్న ఊదా రంగు యుద్ధ విషాదాలు, నెత్తుటి పాదాలతో కాలిన గాయాలతో ఎర్రబారిన నల్లని తారు రోడ్లపై ఇంకిపోయిన స్వేదపు ఆనవాళ్ళ తాలూకూ ప్రచ్ఛాయల్ని సైతం పట్టిచ్చిన పరివేదన అది.
చదివిన సమాజం అబద్దంగానో, అసంబద్దం గానో కనబడకపోతే పేచీ ఏముం డదు. హాయిగా బుల్లితెరలోంచి ట్రాన్స్పరెంట్ గా కనబడే అందమైన జీవితాన్ని కళ్ళార్ప కుండా ఎంజారు చేస్తూ, అప్పు డప్పుడు సెంటిమెంట్ కన్నీళ్లని చిటికినివేలి కొన గోటితో విలాసంగా విసిరేస్తూ ALL IS WELL WITH THE WORLD అనుకుంటూ కాలం గడిపే అదష్టవంతులైన వారికి కవిత్వాలూ, కాకరకాయలతో పనేమీ వుండదు. కానీ, ఐదు నక్షత్రాల ఎత్తులో ఆకాశపు అంచున కూచున్నా, అందమైన, మంద మైన, భద్రమైన విండో పేన్ కర్టన్లులోంచి, ఎక్కడో కింద పాతాళలోకంలో, అసర్లు వేసిన చిరుగుబట్టలతో, భగ భగ మండుతోన్న నిప్పుల కొలిమిలాంటి రోడ్డు వారగా నడిచెళ్లిపోతున్న పాదాల తాలూకూ వేదనల్ని చూసి గుండె గాయపడినప్పుడు ఆ వేదన, ఆవేదనై, పరివేదనై, హదయం భారమై కవితగా రూపు కడుతుంది. కవిత ఒక స్వాంతన అవుతుంది. ఎక్కడో ఉన్న కాశ్మీరాలు చేరువౌతాయి, పక్కనే ఉన్న కాళ్ళ కింద భూమిని లాగేసుకు పోతున్న అసోమ్ ప్రజల ఆవేదనలే కాదు, రేపటి రోజు తన పక్కవీధిలో విని పించే ఆక్రందనలు సైతం విన డానికి హదయం సిద్ధమౌతుంది! ఎల్లలు లేని విశ్వమానవ స్ఫూర్తిని గుండెల్లో పొదవి పెట్టుకున్నా, యంత్రాలకు నెత్తుటి ఇంధనాన్ని అర్పించి కూడా, ఇక్కడ ఏదీ తనది కాని వైరాగ్యపు శూన్యాన్ని అద్భు తంగా ఆవిష్కరిస్తారు ఇక్కడ ఏదీ నాదికాదు' కవితలో!
'తితిలీ' వాలి వెళ్ళిపోయాక అది చేసిన కాలం సైతం మాన్పలేని గా యాల్ని నెమరేసుకుంటూ, కళ్లెదుటే కుప్పకూలిన ప్రాణ సమానమైన వట వక్షాల్నీ, ఆకాశపు కప్పుకింద ఆచ్ఛాదన లేకుండా పడివున్న వ్యధార్ధ జీవుల ఇంకిన కన్నీటినీ, వణు కుతున్న వద్దుల్నీ ఆర్తిగా పలకరిస్తారు. అవును యుద్ధ మొక మత్యు హేల! 'ఏ ఒక్కరం మిగలం! 'అది ఊళ్లకు ఊళ్లనే మాయం చేస్తుంది, మానవాభివద్ధిని మట్టి కరిపిస్తుంది! గెలుపు ఓటములు లెక్కించుకోవడానికీ, ఏ కూటమి విజేతో, ఏ జాతులు పరాజితులో లెక్కించు కోవడానికి ఏ ఒక్కరం మిగలం!
'అక్షరానికి సంకెళ్లు' విధించినా అవి వేటగాడి చేతిలో గురితప్పి ఊపిరి పోసు కుంటూనే వున్నారు! అక్షరమంటేనే నశ్వర మవ్వని అస్త్ర శస్త్రాలు... లిపిలో బంధిం చిన పాశుపతాలు... మెదళ్ళలో దూరి అణు విస్ఫోటన చేసే పరమాణు శకలాలు. దబో ల్కర్ లేరు, పన్సారే లేరు, కల్బుర్గీ లేరు,గౌరీ లంకేశ్లు లేరు.... కానీ సమసి పోయిన చరిత్ర కాదు వీరు! నిరంతరం జ్వలించే అక్షరాలు వీరు!
కార్పోరేట్ దాహార్తికి ఆహారమైన అందమైన కాశ్మీరాల చీకటిమయ జీవితాన్ని, ఆకలిమ యమైన బతుకుల్ని ఎంతో వేదనగా వర్ణిస్తారు కశ్మీర సమీరంలో కవయిత్రి. యుద్ధ బీభత్స భయాన్విత దశ్యాలే కాదు, అమ్మతనపు కమ్మదనాన్నీ, స్నేహం తాలూకూ తియ్య దనాన్నీ,స్త్రీ హదయపు భావుకతల్నీ, ఆకాశపు హర్మ్యాల వంటరి అనుభూతుల్నీ, హదయం రాగరం జితమైనప్పుడు అంతుచిక్కని ఎడారి సీమలో రొమాంటిక్ గా సేద తీర్చే ఒయాసిస్ నీ, ఒక జ్ఞాపకాన్నీ, వినిపించని పాదాల సవ్వడి నేల కతికించుకున్న మనసునూ, వద్దన్నా వినకుండా రుధిర గీతాలు ఆలపించి వసంతాన్ని నింపే మధురోహలని సైతం గుదిగూర్చి కవిత్వీకరించారు సర్వమంగళ 'నెమిసిస్' లో!
నెమెసెస్ ఒక అనుభూతుల పారవశ్యం. అన్నింటికీ మించి అడుగంటిపోతున్న మానవతా విలువల పట్ల బాధ్యత గుర్తెరిగిన ఒక స్త్రీ మూర్తి సంవేదనా ఫలితం. దారీతెన్ను కానక, ఎటుపోతుందో తెలియక ఒక సందిగ్ధ సంధ్యలో దేశ భవిష్యత్ కొట్టుమిట్టాడుతున్న నేపధ్యంలో ఒక తపనతో, ఒక పరివేదనతో, అక్షర నక్షత్రాల వెలుగు దివ్వెలా ఒక ఆశావహ దక్పథాన్ని నింపే ప్రయత్నం చేస్తో వచ్చిన 'నెమెసెస్' నిజంగానే అనేక అనుభూతుల రంగుల హరి విల్లు. సప్తవర్ణ హదయ తంత్రులు మీటిన స్పందనల ఇంద్ర ధనువు.
(వత్తి రీత్యా కోల్కతాలో వుంటూ మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ,సామాజిక ఉద్యమాల పట్ల చురుగ్గా స్పందిస్తూ వస్తున్న సర్వమంగళ గారి కవితలు వామపక్ష భావజాలం ఉన్న పాఠక లోకానికి సుపరిచితాలు. 'నెమెసెస్' వారి తొలికవితా సంపుటం.)
- వి.విజయకుమార్,
ఫోన్: 8555802596