Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివక్షతా బాకులకు
గాయపడ్డ ఓ పసిహదయం
గుడిబడి కాదన్నా
వీధిదీపాలే
విజ్ఞానకాంతులుగా మార్చుకొని
తనమేధస్సుతో
సమస్తభారతావనికే
దారిచూపింది
విధిక్రూరత్వాన్ని ఎదిరించి
వికతచేష్టలను సహించి
అసమానతల విషభావనలను
అడుగడుగునా నిలదీసి
సంకల్పబలమే ఆయుధంగా
ఆటంకాలు అధిగమించి
మురికివాడ బ్రతుకులను
ముసాయిదాకు ముడివేసింది
మానవత్వాన్ని విస్తరించే
బౌద్ధమతాన్ని ఆచరించి
మనిషిని మనిషిగా
చూడాలన్న ప్రభోదనతో
ఆరోవేలై మొలిచిన
అంటరానితనానికి
అంటకత్తెర వేసింది
చరిత్రలో తనకంటూ
పుటలు లిఖించుకొంది
ఆ పసి హదయం...
ఎవరోకాదు
సమసమాజ నిర్మాత
భరతమాత ముద్దుబిడ్డ
భరతరత్నం ''అంబేద్కర్''
ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...
- వేమూరి శ్రీనివాస్
9912128967