Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవిత్ర భారతంలో ..
చరిత్ర పొడవునా
వివక్షా భావాల ఆధిపత్యం
అసమానతల అమానుషం.
ఈ పుణ్య ధరిత్రిలో
అగ్రభాగం బహుజనం
అర్ధ భాగం మహిళా జగం
అగ్రభాగపు పాదాలకి
కుల ఉగ్రవాదపు సంకెళ్లు
అందులో మరి కొందరికి
అదనంగా ఇనుప గుండ్లు
అర్ధభాగపు రెక్కలపై
అలవిమాలిన ఆంక్షలు
పురుష దురహంకారపు
భావాల బరువులు
బంధించిన కాళ్లతో, భారమైన రెక్కలతో
ఎగిరేది ఏ తీరాలకు,చేరేది ఏ దూరాలకు?!
చింతించిన మహనీయులు
సంస్కరింపబూనినారు
జీవితాంతం కషి చేసినారు
అందున మొదటి వరుస నిలిచినాడు
పూలే మహాత్ముడు
సత్యశోధక్ సమాజ్ స్థాపించి,
నిత్యమూ ఉద్యమించి,విద్యలనందించి
భావ విప్లవం సాధించినాడు
బాధితులకు,
అక్షరమే ఆయుధమని చాటినాడు.
పూలే తత్వం..అంబేద్కర్ వ్యూహం
నవసమాజ స్థాపనకు సరియైన మార్గం
చైతన్యముంటేనే అది సాధ్యం.
- డా. డి.వి.జి.శంకర రావు
94408 36931
మాజీ ఎంపీ, పార్వతీపురం