Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమొక రణరంగం
జాగరూకత దాని అంతరంగం!
పాలనమొక పద్మవ్యూహం
ధిక్కరణ దానికి మిత్రభేదం!
సామాజిక పరివర్తన కోసం
సాయుధ ప్రతిఘటన పథం!
ప్రజా సంఘటిత పోరాటాలు
పల్లవించే చైతన్య కెరటాలు!
విధి నిర్వహణ!
విస్మరించరాని బాధ్యత
విపత్కర సందర్భాల్లో!
విడదీయరాని విధేయత
మందుపాతరలు!
ముందరే పేలుతున్నా
మనుగడ కోసం పోరాటం!
ఆధిక్యతకై ఆరాటం!
కరిగిపోయే కాలంలో
మానవకల్పిత మహౌత్పాతాలు
జరిగిపోయే కోలాహలంలో
మానవతప్పిద మారణహౌమాలు!
చంపుడుపందేలతో పరంపరాగత
హాలాహల వినిమయాలు!
చిన్నాభిన్నమయ్యే కుటుంబాలు!
ఛిద్రమయ్యే ఆశయసౌధాలు!
సంక్షేమరాజ్య భావన
విస్మరించే పాలకపగ్గాలు
సటంక్షోభపరిణామాలకు దారితీసే
పేదరిక విషవలయాలు
ప్రాథమికావసరాలు ప్రతిగూడెం
తలుపు తట్టాలి
ప్రజాస్వామ్య పరిమళాలు!
రగిలే గుండెలోతుల్ని స్పశించి చుట్టేయాలి!
- కరిపె రాజ్ కుమార్,
8125144729