Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కంటిని మన వేలితో పొడిచే
మెత్తని మేక వన్నె పులులు
బొట్లు బొట్లుగా మన మస్తిష్కాల్లో
నింపే విషం
మౌనపు మరణ శాసనాలను లిఖిస్తుంటే
రాలిన రక్తపు చుక్కల జాడ లో
కార్చిన కన్నీటి వేదనలెన్ని
ఆకలి పేగులను అదిమి పెట్టి
గ్రహాంతరాల గతులు మార్చాలనే
మరయంత్రపు మానవ నైజం పై
ఎక్కుపెట్టిన ధిక్కారం పట్ల ఎందుకింత ఆక్రోశం
నేలతల్లి గర్బగుడి లో పదిలంగా నున్న సిరులు
దాగా కోరులకు దాసోహాం చేసే కుతంత్రాలను తిప్పికొట్టే నేర్పరి తనాన్ని నేరమని నిలదీద్దామా
మన శరీరాన్ని ముక్కలు జేసి
ప్రపంచపు విపణి వీధిలో
అమ్మకానికి అర్రులు చాస్తున్న
ద్రోహా చింతనా పరుల దోపిడి
తత్త్వానికి వంతలు వేద్దామా!
ఆక్సీజన్ కరువై ఆయువు మూడుతున్న
అభాగ్యులున్న దేశములోను
పచ్చ నోట్లే ప్రాణ వాయువుగా
ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్న ధర్మకర్తలం కదా
జిగి సచ్చిన ముఖాలకు రంగులద్దుకొని
కతక నటనలకు అలవాటు పడ్డ మనుషులం
గాయాలు మెలిపెడుతున్న బాధలను బయటకు కక్కలేని అసాయ శూరులం
ఫలితాలను నిర్దేశించుకోలేని గాలి వాటం బతుకులకు
ఫలాలనిచ్చే చెట్లపై రాళ్ళేయడం ఎంత సులువైన విద్యో తెలిసిందే కదా
- గన్ రెడ్డి ఆదిరెడ్డి.
9494789731