Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతను
స్వేదం చిందించనిదే
ఈ మట్టికి పరిమళమబ్బదు!
అతను
నింగికీ నేలకూ సేతువవ్వందే మన జీవితాల్లో కాంతి రేఖలు విచ్చుకోవు!
అతను
యంత్రమై చక్రం తిప్పందే
మన ప్రగతి రథం పరుగులు తీయదు!
అతను
మబ్బయి కరగందే
మన ఆకలి దప్పులు తీరవు!
అతను
సరిహద్దులెరగని రైతు
అలుపెరుగని శ్రామికుడు!
అన్ని కాలాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ
అతనే లోకానికి ఆధారమై నిలిచిండు!
అతను
సూర్య తేజో సంపన్నుడైనా
ఇంకా అతని జీవితంలో చీకట్లు తొలగ లేదు!
పైగా ఈ వస్తుమయ ప్రపంచంలో సష్టి కర్త స్వయంగా ఒక వస్తువవడం ఏ హేతువుకందని వింత పోకడ!!
(మేడే సందర్భంగా.....)
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261