Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టాల కాడిని మోస్తూ
జోడి ,సరిజోడు అడుగులకు
అమ్మ...ఒక ఆలంబనం!
బరువుబాధ్యతలనుచిలికి అలిసినా
అమతాన్నే అందించే
అమ్మ... ఒక పాలసముద్రం!
కష్టాల కుంపటి బ్రతుకులకు
జాలిపడి మనసు కరిగే
అమ్మ...ఒక మంచుపర్వతం!
కుటుంబ అలజడుల
అలలను అదుపు చేసే
అమ్మ... ఒక చెలియలికట్ట!
సంకటాల సంసార నావను
సంతోషాల తీరం చేర్చే
అమ్మ... ఒక చుక్కాని!
బందాల బాటలో
అనుబంధాలను అల్లే
అమ్మ... ఒక చెలిమి!
ఆశ నిరాశల ఒంటరి
బ్రతుకు ఎడారిలో
అమ్మ... ఒక ఆశల చెలిమ!
తరాన్ని తరతరాన్ని
నిరంతరం తరింపజేసే
అమ్మ... ఒక అవతారం!
- పి.బక్కారెడ్డి
9705315250