Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ఒక్కడి చేయీ
శవాన్ని ముట్టుకోవటానికి
ఇష్టపడనప్పుడు
ఆ నలుగురితో పని ఏముటుంది?
భయంకర వైరస్ విజృంభిస్తున్న వేళ
పరుల గురించి పట్టించుకోకపోవటమూ
స్వార్థం అనిపించుకోదు
మూలుగుకూడ వినాలంటే
భయపడుతున్న లోకంలో
రోదనలూ, ఆర్తనాదాలు
బిక్కుబిక్కుమంటూ
ఏ బిలంలోనో దాక్కుంటాయి
కమ్ముకున్న చీకట్లపై
వెలుతురు రేఖలను కప్పలేనప్పుడు
తిమిరం బాకులా గుచ్చుకుంటుందని
మిణుగురులూ దరిచేరవు
ప్రాణవాయువు అందనంతగా
గాలిలో తేలిపోతున్న ప్రాణాలకు
ఊపిరిలూదే నాథుడు
కనపడని సిలిండర్ల కోసం
దిక్కులు చూస్తుంటాడు
వీధుల్లో బారులు తీరిన శవాలనడుమ
పాజిటివ్ నెగిటివ్ల యుద్ధం
గెలుపుకు ఆనందించటం మాటటుంచితే
ఓటమిని ఓర్చుకోవటానికి
కొంచెం కన్నీరైనా ఉండాలి
మనుష్యుల మారణ హోమం నడుమ
పదవుల కోసం పాకులాడే నాయకులు
స్మశానదేశంలో కాటికాపరైనా సరేనంటారు
-పొత్తూరి సుబ్బారావు,
సెల్ 9490751681