Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముస్లిము గ్రేవ్ యార్డు
క్రిస్టియన్ సెమెట్రీ
హరిశ్చంద్రఘాట్
మట్టిలోను మంటల్లోనూ
అన్ని చోట్లా ఒకటే దశ్యం
అశ్రుగ్రంథి స్రవించిన హద్యం
ముల్లాలు, ముజావర్లు, మౌజంలు
పీఠాధిపతులు, పోపు, పాస్టర్లు
వారివారి మహత్మ్యాలతో
వారివారి జీవుల వేదనాక్షరాలలో
పాహీ, మెర్సీ, రెహమ్
జాబులంపారు
గుడీ, మసీదు, చర్చి
అన్ని చోట్లా ఒకటే దశ్యం
వేలాడే తాళం, నిర్జననీరవ పద్యం
కాలం పోస్టు మేన్
దేశం దేశం
పల్లెపట్నం ఊరూ వీధివీదీ
తిరిగి తిరిగి తిరిగీ వెనుదిరిగాడు
పోపు, ముజావర్, పీఠాధిపతులు
అందరికీ అందాయి తిరిగి వచ్చిన జాబులు
అన్నిటి మీదా ఒకటే ముద్ర
అడ్రస్సీ నాట్ ఫౌండ్ ....
- పులికొండ సుబ్బాచారి