Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూపులతోనే
ఐస్ క్రీం చప్పరిస్తూంది
అనాధపిల్ల
చావునితాగి
బతుకు పంచుతుంది
పచ్చనిచెట్టు
మౌనమే కాని
పరిమళమొక్కటే
పూవులభాష
చీకటి రాత్రి
మిణుగురు పాటతో
వెన్నెలనాట్యం
సిపాయి తినే
పిడికెడు ముద్దయిన
రైతుచలవే
నవ్వినా ఏడ్చినా
కన్నీటి బ్రతుకంతా
రెప్పల మధ్యే
ఇంద్రజిత్తులా
ఎన్ని వింతరూపాలో
అద్దంలోనాకు
చెట్టుని కూడ
అర్ధవంతం చేస్తుంది
పిచ్చుక పాట
సముద్రానికి
నిదుర దూరం చేసింది
తుఫాను రాత్రి
పాట కొరకు
వెదురుని వేడుకుంది
అడవిగాలి
- డా|| పెరుగు రామకష్ణ
9849230443