Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాతోనూ
కరెన్సీ నోటుతోనూ
కాలే కడుపుతోనూ
కూలీ బతుకుతోనూ
కాలిబాటతోనూ
కానరాని సర్కారు సాయంతోనూ
ఆత్మనిర్బరమెమోకానీ
అన్నం దొరికే దారి లేదాయో
వేల మైళ్లు నడిచి బొబ్బలెక్కిన శ్రమజీవులు
ఉపాధి కానరాక ఉరికొయ్యలకూగిరి
సర్కారీ లెక్కల్లో చచ్చింది పావు వంతే
శ్మశానాల్లో లెక్కలు తేల్చేదెవరు
ఆకలిచావులెన్నీ
ఆత్మహత్యలెన్నీ
దివాళదీసిన వ్యాపారులెందరు
ప్యాళాలేరుకుంటున్న బడాబాబులెందరు
ఉపద్రవం మళ్లీ ముంచుకొచ్చే
కత్తిగట్టి, కక్ష్యగట్టి
చప్పట్లూ తాళాలు
దీపాలూ పూలు అయిపోయాయి
ఉన్నదంతా నటనా
మాటల మంత్రదండం
కాలుతున్న శవాల కమ్రు వాసన
ఆగుతున్న ఊపిరి శబ్దం
శ్మశానాల వద్ద శవాల వెయిటింగ్
వెంటిలేటర్ లేక రోగుల ఆర్తనాదాలు
సామాన్యునికో, మీడియాకో
కనిపించే దశ్యం
భరించలేని వాసన
ఏలికలకేమెరుక
నీరోలు కదా
శవాల కమ్రువాసన
పరిమళమై వారికి చేరుతుందేమో
ఆక్రందనలు
సప్తస్వరాలు పలుకుతున్నాయేమో
లేదంటే బతికినోడు
ఓటేయక చస్తాడా అని వదిలేశారో
మందిరమో.. మసీదో..
ఓట్లు రాల్చకపోతాయా
అసత్యాలు సీట్లు తేకపోతాయా..
చావండి జనులారా చావండి...
ఓటేసిన ఖర్మానికి చావండి
- ఎం.వి.ప్రసాద్