Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పావురాలు వాలని చెట్టులా...
పిచ్చుకలు మేయని చేల గట్టులా...
సీతాకోకచిలుకలు ఎగరని
చీకటికొట్టులా...
చేతులు సాచిన అమ్మ ఒడిలా...
నీరు లేక ఎండిపోయిన నారుమడిలా...
పిల్లలు లేని మా బడి...
మైదానమంతా పరుచుకునే
పిల్లల పాదముద్రల జాడలు లేవు...
వరండాలలో కదలాడే చిన్నారుల
వెలుగునీడలు లేవు...
కళ కళ లాడే రేపటి భవిష్యత్తు
నిర్మాణ గదులు నిర్మానుష్యంగా..
పసి పిల్లల పసిడి నవ్వులు
దశ్యాదశ్యంగా...
ఆటలు లేవు...
పాటలు లేవు...
పాఠాలు లేవు...
కేరింతలు లేవు...
భవితవ్యంపై కలవరింతలు లేవు....
రేపటి సూర్యుళ్ల పాలపుంతలు లేవు...
కరోనా..
నువ్వు కాలం విసిరిన గాలానివా..
మనిషిని మాయం చేసిన ఇంద్రజాలానివా...
కరోనా..
నువ్వు భూగోళానికి గాయానివా...
మా బతుకుల్ని శాసిస్తున్న
మత్యు గేయానివా...
జ్ఞానం కన్నా ప్రాణం మిన్నా
అనుకుని సర్దుకుని ఉన్నా...
అక్షర బిక్షను దూరం చేయకు....
ప్రాణాల్ని హరిస్తూ కత్తులు దూయకు..
ఇక నీ కల్లోలం చాలించి...
కనుమరుగై పో...
- మంగు జయప్రకాశ్
9966988917